Google Lens అంటే ఏమిటి?

Google Lens అనేది విజన్ ఆధారిత కంప్యూటింగ్ సామర్థ్యాల సమాహారం. ఇది మీరు దేనిని చూస్తున్నారనేది అర్థం చేసుకుని, ఆ సమాచారం ఉపయోగించి టెక్స్ట్‌ని కాపీ చేస్తుంది లేదా అనువదిస్తుంది, మొక్కలు, జంతువులను గుర్తిస్తుంది, భాషలు లేదా మెనూలను అన్వేషిస్తుంది, ప్రోడక్ట్‌లను కనుగొంటుంది, విజువల్‌గా ఒకే విధంగా కనిపించే ఇమేజ్‌లను కనుగొంటుంది, ఇతర ఉపయోగకరమైన చర్యలను తీసుకుంటుంది.

మీకు కనిపించే వాటిని సెర్చ్ చేయండి

Google Lens సహాయంతో మీరు చూసే వాటిని సెర్చ్ చేయగలుగుతారు. ఫోటో, మీ కెమెరా లేదా ఇంకేదైనా ఇమేజ్‌ను వినియోగించడం ద్వారా విజువల్‌గా ఒకే విధంగా ఉండే ఇమేజ్‌లు, సంబంధిత కంటెంట్‌ను కనుగొనడంలో, ఇంటర్నెట్ అంతటి నుండి ఫలితాలను పొందడంలో Lens మీకు సహాయపడుతుంది.

Google Lens ఎలా పని చేస్తుంది

Lens మీ ఫోటోలోని ఆబ్జెక్ట్‌లను ఇతర ఇమేజ్‌లతో సరిపోలుస్తుంది, అలాగే ఆ ఇమేజ్‌లను ఒరిజినల్ ఫోటోలోని ఆబ్జెక్ట్‌లతో సారూప్యత, సంబంధం ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తుంది. మీ ఫోటోలోని ఆబ్జెక్ట్‌ల గురించి తనకు అర్థమైనంత మేరకు, Lens వెబ్ నుండి సందర్భోచితమైన ఇతర ఫలితాలను కూడా వెతుకుతుంది. అలాగే ర్యాంకింగ్, సందర్భ ఔచిత్యాన్ని కనుగొనడానికి Lens ఇమేజ్‌ను హోస్ట్ చేస్తున్న సైట్‌లోని పదాలు, భాష, ఇతర మెటాడేటా లాంటి సహాయకరమైన అంశాలను కూడా ఉపయోగించవచ్చు.

ఇమేజ్‌ను విశ్లేషిస్తున్నప్పుడు, Lens సాధారణంగా పలు ఫలితాలను జనరేట్ చేసి, ఒక్కో ఫలితం ఎంత సందర్భోచితమైనది అనే దాని ఆధారంగా ర్యాంక్‌ను కేటాయిస్తుంది. Lens కొన్నిసార్లు ఈ సాధ్యమైన ఫలితాలను ఒకే ఫలితానికి కుదిస్తుంది. ఉదాహరణకు Lens ఒక కుక్కను చూస్తున్నప్పుడు, దాన్ని 95% జర్మన్ షెపర్డ్ అని, 5% కార్గీ అని గుర్తించందనుకోండి. ఈ సందర్భంలో Lens విజువల్‌గా అత్యంత సారూప్యంగా ఉందని నిశ్చయించిన జర్మన్ షెపర్డ్‌కి సంబంధించిన ఫలితాన్ని మాత్రమే, Lens చూపించే అవకాశం ఉంటుంది.

ఇతర సందర్భాలలో, మీ ఫొటోలో మీకు ఆసక్తి ఉన్న ఆబ్జెక్ట్‌ను Lens ఖచ్చితంగా గుర్తించినప్పుడు, ఆ ఆబ్జెక్ట్‌కు సంబంధించిన సెర్చ్ ఫలితాలను అందిస్తుంది. ఉదాహరణకు, ఇమేజ్‌లో జీన్స్ లేదా స్నీకర్స్ లాంటి నిర్దిష్ట ప్రోడక్ట్ ఉన్నప్పుడు - Lens ఆ ప్రోడక్ట్ గురించి మరింత సమాచారాన్ని అందించే ఫలితాలను లేదా ప్రోడక్ట్‌కు సంబంధించిన షాపింగ్ ఫలితాలను అందించవచ్చు. అలాగే Lens అటువంటి ఫలితాలను అందించడానికి ప్రోడక్ట్ యూజర్ రేటింగ్‌లు లాంటి అందుబాటులో ఉన్న సంకేతాలపై కూడా ఆధారపడవచ్చు. మరొక ఉదాహరణలో, ఇమేజ్‌లోని బార్‌కోడ్ లేదా టెక్స్ట్‌ని Lens గుర్తిస్తే (ఉదాహరణకు, ప్రోడక్ట్ పేరు లేదా బుక్ పేరు లాంటివి), ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన Google Search ఫలితాల పేజీని Lens అందించవచ్చు.

సందర్భోచితమైన, ఉపయోగకరమైన ఫలితాలు

Lens ఎల్లవేళలా అత్యంత సందర్భోచితమైన, ఉపయోగకరమైన ఫలితాలను అందించడానికి ట్రై చేస్తుంది. అడ్వర్టయిజ్‌మెంట్‌లు లేదా ఇతర వాణిజ్యపరమైన ఏర్పాట్ల వలన Lens అల్గారిథమ్‌లు ప్రభావితం కావు. Lens ఇతర Google ప్రోడక్ట్‌లు, దాంతో పాటు Google Search లేదా షాపింగ్ నుండి ఫలితాలను అందించినప్పుడు, ఫలితాలు ఆ ప్రోడక్ట్‌ల ర్యాంకింగ్ అల్గారిథమ్‌లపై ఆధారపడి ఉంటాయి.

Lens ఫలితాలు సందర్భోచితంగా, సహాయకరంగా, సురక్షితంగా ఉండేలా చూడటానికి, Lens అభ్యంతరకరమైన ఫలితాలను గుర్తించి, ఫిల్టర్ చేస్తుంది. Google అంతటా ఉండే Google SafeSearch గైడ్‌లైన్స్ లాంటి స్టాండర్డ్స్ ఆధారంగా ఈ ఫలితాలను గుర్తిస్తుంది.

Lens & లొకేషన్

మీ లొకేషన్‌ని ఉపయోగించడానికి Lensని అనుమతించినప్పుడు, ఉదాహరణకు, స్థలాలు, ల్యాండ్‌మార్క్‌లను గుర్తించగలిగినప్పుడు, అది ఆ సమాచారాన్ని ఉపయోగించి మరింత ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. కనుక మీరు ప్యారిస్‌లో ఉన్నప్పుడు, మీరు ఈఫిల్ టవర్‌నే చూస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఉండే ఇతర నిర్మాణాలు కాదని Lens గ్రహించగలుగుతుంది.